గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్‌ పరిక్రమ’ – Sakshi

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల 
ముత్తుకూరు: గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్‌ పరిక్రమ’ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పరిశీలించడానికి ఆయన శనివారం చెన్నై నుంచి ప్రత్యేక నౌకలో నెల్లూరు జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు.
ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పోర్టు సీఈవో జీజే రావు స్వాగతం పలికారు. రూపాల పోర్టులో పర్యటించి అక్కడ జరుగుతోన్న అభివృద్ధి, ఎగుమతి దిగుమతుల వివరాలను తెలుసుకున్నారు. సముద్రతీర ప్రాంతంలో ఫిషింగ్‌ జెట్టీల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి కాకాణి ఆయనకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మత్స్యకార భరోసాపై మంత్రి అప్పలరాజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు ఎంపీ బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిçషనర్‌ కన్నబాబు, ఎంపీ జీవీఎల్‌తో కలిసి కృష్ణపట్నం ఆర్కాట్‌పాళెంలోని మత్స్యకార గ్రామాలను రూపాల సందర్శించారు.

 

Dina Phalalu     Vara Phalalu
health tips
Current Affairs Practice Test
Telugu News  |   Latest News Online   |   Today Rasi Phalalu in Telugu   |   Weekly Astrology   |   Political News in Telugu   |   Andhra Pradesh Latest News  |   AP Political News  |   Telugu News LIVE TV  |   Telangana News   |   Telangana Politics News  |   Crime News  |   Sports News  |   Cricket News in Telugu   |   Telugu Movie Reviews   |   International Telugu News   |   Photo Galleries   |   YS Jagan News   |   Hyderabad News  |   Amaravati Latest News   |   CoronaVirus Telugu News  |   Web Stories


Live TV   |   e-Paper   |   Education   |   Sakshi Post   |   Business   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Terms and Conditions   |   Media Kit   |   SakshiTV Complaint Redressal
sakshi facebook    sakshi twitter    sakshi instagram    sakshi youtube    sakshi telegram    google news      
© Copyright Sakshi 2023 All rights reserved.
Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

source

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Join Whatsapp Group!
Scan the code